telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ హెల్ప్ లైన్ లో మార్పు.. ఇక అన్నిటికి 112 నే.. !

govt help line changed to 112

ఇప్పటి వరకు ఏదైనా అత్యవసర సాయం కావాలంటే, 100, 108, 1090 లాంటి నెంబర్ లకు కాల్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇవన్నిటిని తీసేసి, 112 గా మార్చేశారు. ఇక ఏ అత్యవసరానికైనా ఈ నెంబర్ ఒక్కటేనట. తాజాగా, హోంమంత్రి రాజ్‌నాథ్‌ ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో కొత్త హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా అత్యవసర హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. 100, 101, 108, 1090 నంబర్లకు బదులు 112 నెంబర్‌ను తీసుకొచ్చింది.

తెలుగు రాష్ట్రాలు సహా 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 112 నెంబర్ అందుబాటులో ఉండనుంది. ఏ అత్యవసరమై ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేస్తే ఆయా శాఖలకు సమాచారం అందిస్తారు.

Related posts