telugu navyamedia
రాజకీయ

గంటా వ్యాఖ్యలపై గవర్నర్ నరసింహన్ ఫైర్!

Republic Day Celebrations Hyderabad
ఆంధ్ర విశ్వ విద్యాలయం 86వ  స్నాతకోత్సవ వేడకలకు గవర్నర్ నరసింహన్, మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  గవర్నర్ నరసింహన్ వర్సెస్ మంత్రి గంటా శ్రీనివాసరావులుగా ప్రసంగం సాగింది. ఈ సందర్బంగా ఓకే వేదిక పై ఒకరినొకరు విమర్శించుకున్నారు.  ప్రభుత్వ వర్శిటీలు ప్రైవేట్ వర్శిటీలతో పోటీపడాలన్న గంటా వ్యాఖ్యలపై గవర్నర్ నరసింహన్ ఫైర్ అయ్యారు. 
ఆ వ్యాఖ్యలు నేరపూరితం అంటూ విరుచుకుపడ్డారు.  
స్నాతకోత్సవ వేడుకలో భాగంగా మంత్రి గంటా విద్యారంగానికి ఏటా రూ.25 వేల కోట్లు వెచ్చిస్తూ రాష్ట్రంలో విజ్ఞాన సమాజాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వస్తున్నాయని గుర్తు చేశారు. ప్రైవేట్ వర్శిటీలతో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పోటీ పడాలని సూచించారు. ప్రైవేట్ యూనివర్శిటీలతో ప్రభుత్వ యూనివర్శిటీలు పోటీపడాలని మంత్రి వ్యాఖ్యానించడం  గవర్నర్ సరికాదన్నారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయొద్దని కోరారు. పీహెచ్‌డీలను డిగ్రీ తరహాలో మార్చేశారని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 
విశ్వవిద్యాలయాల్లో పలు నియామకాలకు, పదోన్నతులకు పీహెచ్‌డీ చేసి ఉండాలన్న నిబంధన విధిస్తుండడంతో చాలా మంది  ఇష్టం వచ్చినట్లు పీహెచ్‌డీలు చేస్తున్నారని వాపోయారు. ప్రస్తుత విద్యావ్యవస్థలో కట్‌, కాపీ, పేస్ట్‌ సంస్కృతి ఎక్కువగా ఉంటోందన్నారు.  ఈ అంశాలపై దేశవ్యాప్తంగా సమీక్ష జరగాలి అని గవర్నర్‌ నరసింహన్ వ్యాఖ్యానించారు. ఆచార్య రామ్‌గోపాల్‌రావుకు గౌరవ డాక్టరేట్‌ను, 546 మందికి డాక్టరేట్‌లు, ఆరుగురికి ఎంఫిల్‌ డిగ్రీలు, వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన 573 మందికి పతకాలను గవర్నర్ నరసింహన్ ప్రదానం చేశారు.

Related posts