telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఈ గొరిల్లాలను చూస్తే… మనుషులు కోతుల నుండే వచ్చారనాల్సిందే…!?

Gorilla

అమెరికాలోని దక్షిణ కరోలినా జూలో దీనికి తగ్గట్టే ఓ సీన్ సందర్శకుల కంటపడింది. అక్కడ జూలోని కొన్ని గొరిల్లాలు.. అచ్చం మనుషుల్లాగే ప్రవర్తించడంతో సందర్శకులంతా ఆసక్తిగా చూస్తూ ఉండిపోయారు. వర్షం పడుతుండగా.. తమ బిడ్డలు తడవకుండా ఉండాలనే ఉద్దేశంతో అవి పడ్డ తాపత్రయం ఔరా అనేలా చేసింది. పిల్లల్ని పొత్తిళ్లలో పట్టుకుని.. చుక్క నీరు వాటిమీద పడకుండా ఎంతో జాగ్రత్తగా వెళ్లాయి. ఆ సమయంలో అవి ప్రదర్శించిన హావభావాలు.. కళ్లు తిప్పుకోకుండా చేశాయి. ముఖ్యంగా ఓ మగ గొరిల్లా.. పిల్లల బాధ్యతను ఆడ గొరిల్లాలకు అప్పగించి.. తనకేమి పట్టనట్టు వ్యవహరించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. తడవకుండా ఉండే చోటు కోసం ఆడ గొరిల్లాలు వెతక్కొని అతి జాగ్రత్తగా ముందుకు వెళ్లిపోయాయి. ఆ తర్వాత తీరిగ్గా మగ గొరిల్లా వాటిని అనుసరించింది. నీళ్లు ఎక్కడ పడతాయో అన్నట్టుగా.. గోడకు ఆనుకుని వెళ్లింది. ఆ సమయంలో దాని ముఖాన్ని చూస్తే.. మనుషులు గుర్తుకు రాకమానరు. వర్షంలో తడవకూడదనుకునే మనుషులు.. ముఖాన్ని ఎలా పెడతారో అచ్చం అలాగే పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోను జూ అధికారి ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సాధారణంగా మనుషుల్లో ఉండే పురుషాధిక్యం గొరిల్లాల్లో కూడా కనపడటంతో.. నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేసేస్తున్నారు.

Related posts