telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నేను కడిగిన ముత్యంముత్యంలా బయటపడతా..

ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజనల్ కాదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియాకు వివరాలు వెల్లడించిన అనంత‌రం మాధవ్ స్పందించారు.

తాను మొదటి నుంచి తనపై కుట్ర జరిగిందని చెబుతూనే ఉన్నానని.. కొంతమంది దుర్మార్గులు కావాలనే ఇలా చేశారని, వీడియోని మార్ఫింగ్‌ చేశారని తాను ఆ రోజే చెప్పానని ఎంపీ అన్నారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టటానికే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

తాను మొదటి నుంచి తనపై కుట్ర జరిగిందని చెబుతూనే ఉన్నానని.. ఇకనైనా ఈ రాద్ధాంతానికి పుల్‌స్టాప్‌ పెట్టాలని కోరారు. ఇలాంటి నీచమైన చర్యలతో నీ పార్టీ బతకదన్నారు. తెలుగుదేశం పార్టీ నికృష్టపు ఆలోచనలు చేస్తోందన్నారు.ఈ వ్యవహారంలో తాను కడిగిన ముత్యంలా బయటపడతానని మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. .

ఫేక్‌ వీడియో సృష్టించి తనను అవమానించాలని చూశారని.. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తానన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై పరువు నష్టం దావా వేస్తాన‌ని తెలిపారు. తనపై దుష్ప్రచారం చేసిన వాళ్లు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలన్నారు.

Related posts