telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“చాణక్య” టీజర్ అదిరిపోయింది…!

Chanakya

యంగ్ హీరో గోపించంద్ హీరోగా త‌మిళ ద‌ర్శ‌కుడు తిరు ద‌ర్శ‌క‌త్వంలో “చాణ‌క్య” అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన మెహరీన్, జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తైంది. ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు, అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో గోపీచంద్ లుక్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు గోపీచంద్. ఈ టీజర్ చూసిన ప్రేక్షకులు ఈ చిత్రంతో గోపిచంద్ మంచి హిట్ కొడ‌తాడ‌ని భావిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది. మీరు కూడా ఈ పవర్ ఫుల్ టీజర్ ను వీక్షించండి.

Related posts