telugu navyamedia
వార్తలు విద్యా వార్తలు సామాజిక

విద్యార్థుల కోసం గూగుల్ యూట్యూబ్ లెర్నింగ్!

google youtube

లాక్‌డౌన్‌ అలవుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలు మూతపడడంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. వారి కోసం గూగుల్ సరికొత్త ఈ-లెర్నింగ్ విభాగాన్ని అందుబాటులోకి తెస్తోంది. విద్యార్థులతోపాటు బోధనా సిబ్బందికి అనుకూలమైన ఫ్యూచర్స్‌తో ఇది అందుబాటులోకి రానుంది. ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో అందుబాటులో ఉండే ఈ విభాగంలో సైన్స్, మ్యాథ్స్‌, భాషలతోపాటు నైపుణ్యాభివృద్ధి అంశాలు, యోగా, ఫొటోగ్రఫీ పై పాఠాలుంటాయని యూట్యూబ్ తెలిపింది.

భవిష్యత్తులో తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ వంటి ప్రాంతీయ భాషల్లోనూ పాఠాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. మొబైల్, డెస్క్‌టాప్‌ రెండింటి ద్వారా ఈ పాఠాలు వినవచ్చు. అలాగే వీడియో సమావేశాలకు ఉపయుక్తమయ్యే ‘గూగుల్ మీట్’ను సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిందీ సంస్థ. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 250 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకేసారి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

ఇప్పటికే ఈ సంస్థ ఈ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని ఉపయోగించి 250 మంది ఉపాధ్యాయులకు శిక్షణ అందించింది.బోధన కోసం ఉద్దేశించిన ఈ రీడింగ్ యాప్‌కు ‘బోలో’ అని పేరు పెట్టింది. దీని ద్వారా విద్యార్థులు ఆయా ప్రొగ్రామ్స్‌ను ఓపెన్ చేసి తమకు తాముగా నేర్చుకోవచ్చు. అలాగే పిల్లల కోసం ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. తొలుత అమెరికాలో అందుబాటులోకి వస్తున్న ఈ సదుపాయం తరువాత ఇతర దేశాల వారికీ అందుబాటులోకి రానుంది.

Related posts