telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

గూగుల్ ఇక … సరికొత్తగా..

google with new features

గూగుల్‌ వినియోగదారుల సమాచారాన్ని సురక్షితంగా, ఆన్‌లైన్‌లో వారి కార్యకలాపాల వివరాలను గోప్యంగా ఉంచడమే లక్ష్యంగా కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్‌ సేవలు వినియోగించుకుంటున్న వారందరికీ ఒకేరకమైన సమాచార భద్రత కల్పించడం తమ లక్ష్యమని వెల్లడించింది. ‘గూగుల్‌ ఉత్పత్తులు, సేవలను వినియోగించుకుంటున్నవారి సమాచార గోప్యతకు మేం ప్రాధాన్యమిస్తాం. ఇందుకోసం సెట్టింగ్స్‌, కంట్రోల్స్‌ను ఎప్పటికప్పుడు నవీకరిస్తాం.

తాజాగా గూగుల్‌ ఉత్పత్తులు, సేవలన్నింటినీ ఒకే టాప్‌తో అందుకునే అవకాశం కల్పించాం. రహస్య శోధన (ఇన్‌కాగ్నిటో మోడ్‌) ఫీచర్‌ను గూగుల్‌ సెర్చ్‌, మ్యాప్స్‌కూ విస్తరించాం. థర్డ్‌ పార్టీ డెవలపర్స్‌ వినియోగదారుల సమాచారాన్ని ఇతరులతో పంచుకుంటున్నారని గుర్తించాం. దీన్ని నియంత్రించడానికి వారందరినీ గోప్యత విధానాన్ని ప్రకటించాలని సూచించాం. అంతేకాదు క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ డెవలపర్స్‌ కూడా వినియోగదారుల భద్రతను కాపాడేలా అదనపు మార్పులు చేశాం’ అని గూగుల్‌ చీఫ్‌ ప్రైవసీ అధికారి కీత్‌ ఎన్‌రైట్‌ విలేకరులతో చెప్పారు.

Related posts