telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

గూగుల్ కు రూ. 1400 కోట్ల జరిమానా… ఎందుకంటే ?

youtube logo

అడ్వర్‌టైజ్‌మెంట్ల కోసం యూట్యూబ్ పిల్లల ప్రైవసీకి భంగం కలిగించిందంటూ ఆరోపణలు రావడంతో యూట్యూబ్ పేరెంట్ సంస్థ గూగుల్ రూ. 1400 కోట్లకు పైగా జరిమానా చెల్లించాలని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ప్రతిపాదించింది. సెప్టెంబరులో ఈ కేసు న్యూయార్క్ కోర్టు ముందుకు రానుంది. కోర్టులో యూట్యూబ్ ప్రైవసీ భంగానికి పాల్పడినట్టు తేలితే.. గూగుల్ రూ. 1400 కోట్ల జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే గూగుల్ సంస్థ వ్యక్తిగత ప్రైవసీ విషయంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తుండగా.. తాజాగా కొత్త ఆరోపణను ప్రైవసీ గ్రూప్స్ తెరపైకి తీసుకొచ్చాయి. 13 ఏళ్ల పిల్లల వ్యక్తిగత వివరాలను.. వారి తల్లిదండ్రులు అంగీకారం లేకుండా యూట్యూబ్‌లో అడ్వర్‌టైజమెంట్ల కోసం వాడుకుంటోందంటూ ప్రైవసీ గ్రూప్స్ తాజాగా ఆరోపించాయి. గోప్యతకు సంబంధించిన విషయంలో గూగుల్ సంస్థ ఫెయిల్ అయిందంటూ ప్రైవసీ గ్రూప్స్ తెలిపాయి. మరోపక్క డిజిటల్ అడ్వర్‌టైజ్‌మెంట్లపైనే గూగుల్ సంస్థ గతేడాది 116 బిలియన్ డాలర్లు(రూ. 8 లక్షల కోట్లకు పైగా) అర్జించిందని.. దీని ముందు రూ. 1400 కోట్ల జరిమానా చాలా తక్కువంటూ ది సెంటర్ ఫర్ డిజిటల్ డెమొక్రసీ అడ్వకసీ గ్రూప్ వాదిస్తోంది. పిల్లల ప్రైవసీకి భవిష్యత్తులో భంగం కలిగించకుండా ఉండాలంటే.. గూగుల్‌కు భారీ జరిమానా విధించాలంటూ అడ్వకసీ గ్రూప్ ఎఫ్‌టీసీని కోరింది.

Related posts