telugu navyamedia
సాంకేతిక

ఏప్రిల్ 2 తరువాత ఈ రెండు గూగుల్ యాప్స్ ఉండవు

Google-plus-and-Inbox

ఏప్రిల్ 2న గూగుల్ కు సంబంధించిన యాప్స్ గూగుల్ ప్లస్, ఇన్ బాక్స్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని గూగుల్ అధికారికంగా ప్రకటించింది. “ఇన్ బాక్స్” యాప్ అనేది గూగుల్ కు సంబంధించిన మరో మెయిలింగ్ ఫ్లాట్ ఫామ్. 2014న గూగుల్ ఇన్ బాక్స్ యాప్ ను విడుదల చేసింది. అయితే ఈ యాప్ లో మంచి ఫీచర్లు ఉన్నా యూజర్లను ఆకట్టుకోలేకపోయింది. దీంతో గూగుల్ అవే ఫీచర్లను జీమెయిల్ లోకి తీసుకొచ్చి, “ఇన్ బాక్స్” యాప్ ను క్లోజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించింది. ఇక ఫేస్ బుక్ కు పోటీగా గూగుల్ తీసుకొచ్చిన గూగుల్ ప్లస్ సేవలు కూడా నిలిపివేయనున్నారు. 2015లో యూజర్ల డేటాను 400 థర్డ్ పార్టీ యాప్స్ చోరీ చేసినట్లు గూగుల్ విచారణలో తేలింది. అందుకే ఇకపై గూగుల్ ప్లస్ సేవల్ని నిలిపివేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది.

గూగుల్ ప్లస్ యూజర్లు ముఖ్యమైన డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదెలా చేయాలంటే…
గూగుల్ ప్లస్ లో ముందుగా సైన్ ఇన్ అయ్యి, డౌన్లోడ్ యువర్ డేటా పేజిలోకి వెళ్ళాక, కావాల్సిన డేటాను సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పేజిలోకి వెళ్ళి ఫైల్ టైపు ను సెలెక్ట్ చేసుకుని, డౌన్లోడ్ చేసుకోండి.

ఇక గూగుల్ ప్లస్ నిలిపివేయగానే మీ ప్రొఫైల్ కూడా డిలీట్ అవుతుంది. కావాలంటే ముందుగానే డిలీట్ చేసుకోవచ్చు.
మీ జీమెయిల్ అకౌంట్ లో సైన్ ఇన్ అవ్వగానే పైన కుడివైపున ఉన్న ప్రొఫైల్ పిక్చర్ కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే అక్కడ గూగుల్ ప్లస్ ప్రొఫైల్ అని కన్పిస్తే… మీ అకౌంట్ గూగుల్ ప్లస్ లింక్ అయి ఉంటుంది. గూగుల్ ప్లస్ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే గూగుల్ ప్లస్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్లి, “డిలీట్ యువర్ గూగుల్ ప్లస్ ప్రొఫైల్” ఆప్షన్ క్లిక్ చేస్తే గూగుల్ ప్లస్ ప్రొఫైల్ డిలీట్ అయిపోతుంది.

Related posts