telugu navyamedia
సాంకేతిక

గూగుల్ సెర్చ్ ఇమేజెస్‌లోనూ ఇక యాడ్స్..! 

Google Images searching Google Ads
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ యాడ్స్ కోసం కొత్త  ఫార్మాట్ ను అందుబాటులోకి తేనుంది.  యాడ్‌వ‌ర్డ్స్ సేవ‌ల ద్వారా అడ్వటైజర్ల  నుంచి భారీ మొత్తంలో సొమ్ము సంపాదిస్తుంద‌నే విష‌యం  తెలిసిందే. ఆన్‌లైన్‌లో ఏ వెబ్‌సైట్‌లోనైనా ప్రకటనలు  ఇవ్వాలంటే చాలా మంది గూగుల్‌ను ఆశ్రయిస్తుంటారు.ఈ నేపథ్యంలో గూగుల్ త‌న అడ్వటైజర్లకు వివిద ర‌కాల యాడ్ ఫార్మాట్‌ల‌ను అందిస్తున్నది. అయితే వాటికి తోడు ఇక‌పై గూగుల్ త‌న ఇమేజ్ సెర్చ్‌లో వ‌చ్చే ఇమేజ్‌ల‌లో కూడా యాడ్స్ ఇచ్చుకునేలా నూత‌న ఫార్మాట్ ను అందుబాటులోకి తేనుంది. ఈ క్రమంలో నెటిజన్ లకు త్వరలో  గూగుల్ సెర్చ్ ఇమేజెస్‌లో కూడా యాడ్స్ కనబడనున్నాయి.  అయితే ఈ సేవ‌లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వ‌స్తాయో గూగుల్ వెల్లడించలేదు.

Related posts