telugu navyamedia
వార్తలు సామాజిక

గూగుల్ ఉద్యోగుల ఆందోళన.. ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్

google office

ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ గూగుల్ కంపెనీ యాజమాన్యంపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులను అణచివేస్తున్నారని ఆరోపిస్తూ శాన్ ఫ్రాన్సిస్కోలోని కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. సుమారు 200మంది ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఎలాంటి ముందస్తు సమాచారంలేకుండా ఇద్దరు ఉద్యోగులను సెలవుపై పంపడంపై సహచర ఉద్యోగులు యాజమాన్యాన్ని అక్షేపిస్తున్నారు. వారిని తక్షణమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో సదరు ఉద్యోగులు కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడంతో వారిని సెలవుపై పంపినట్లు గూగుల్ ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Related posts