• Home
  • వార్తలు
  • పేరుకేమో గూగుల్ ఉద్యోగి…కానీ ప్రియురాలిని పోషించలేక..దొంగతనం..
Trending Today క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక హాస్యం

పేరుకేమో గూగుల్ ఉద్యోగి…కానీ ప్రియురాలిని పోషించలేక..దొంగతనం..

google employee theaft money for lover

ప్రేయసి అవసరాలు తీర్చే ప్రియుడు కనిపించడం కష్టమేమో…ఎంతగా ఎన్ని సార్లు ఖర్చు పెట్టినా ప్రియురాలు మాత్రం తృప్తి పడదు. ఇంకా షాపింగ్ అంటూనే ఉంటుంది.. దానితో ప్రియుడు ఎంత పెద్ద ధనవంతుడైనా ..ఇదిగో ఇదే గతి పడుతుందేమో. ఒక వ్యక్తి చక్కగా గూగుల్ లో ఉద్యోగం సాధించాడు. గూగుల్ అంటే చెప్పేదేముంది, చేతినిండా పైసలే, అంత జీతం వస్తుంది మరి. నేను కొత్తగా చెప్పాల్సిన పనేమీ లేదు, మీకు తెలుసు కదా. మరి అలాంటి వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉండదా.. ఉంది. కానీ మనవడు జీతాన్ని మించి ఖర్చు చేయాల్సిన పరిస్థితికి వచ్చేశాడు. చేసేది లేక పర్సు ఖాళీ అయ్యేసరికి.. దొంగతనం చేయాల్సి వచ్చింది. దీనితో పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజీ ద్వారా జరిగింది తెలుసుకొని రికవరి చేశారు, జరిగింది చెప్పుకొని తన ప్రియురాలి కోసం చేయాల్సి వచ్చింది అని ఆ ప్రియుడు పోలీసుల ముందు సంజాయిషీ చెప్పుకున్నాడు.

ఇదంతా ఢిల్లీకి చెందిన ఐటీ ఉద్యోగి గర్విత్ సాహ్ని అనే వ్యక్తి పడ్డ తిప్పలు. ఢిల్లీలో పనిచేస్తున్న ఇతగాడు గత నెలలో తాజ్ లో జరిగిన ఐటీ సదస్సుకు వచ్చిన మహిళ పర్సు నుండి 10వేలు దొంగిలించాడు. ఇదంతా సీసీ ఫుటేజిలో రికార్డు అవుతుందనే సంగతి అతడు గమనించలేదు. కానీ నగదు పోగొట్టుకున్న మహిళ పిర్యాదు మేరకు విచారణ చేపట్టిన వారికి సీసీ ఫుటేజిలో ఇతగాడు పట్టుబడ్డాడు. తన ప్రియురాలు ఖర్చులు భరించలేకే ఇలా చేయాల్సి వచ్చింది అని విచారణలో తెలిపాడు. అతడి నుండి అధికారులు 3000 మాత్రం రికవరీ చేశారు.

Related posts

కారు ప్రమాదం… సమంత విలన్ కు గాయాలు

vimala t

ఆపరేషన్ గరుడ..! నిన్న శివాజీ, ఈ రోజు పవన్.. ఇదంతా షా

nagaraj chanti

సుప్రసన్నాచార్యకు రాయప్రోలు అవార్డు

admin

Leave a Comment