telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

బెంగుళూరు : గూగుల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్

google office

దేశంలో కరోనా కేసుల సంఖ్య 73కు చేరింది. బెంగుళూరులోని గూగుల్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ వచ్చిందని శుక్రవారం ఉదయం తేలింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా బెంగళూరు గూగుల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను శుక్రవారం ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ‘‘ శుక్రవారం బెంగళూరులోని మా గూగుల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. దీంతో అతన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించాం. ముందు జాగ్రత్త చర్యగా మా ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయాలని కోరాం’’ అని గూగుల్ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. కరోనా వైరస్ సోకిన ఉద్యోగితో సన్నిహితంగా మెలిగిన ఉద్యోగులను కూడా క్వారంటైన్ చేశామని, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని గూగుల్ తెలిపింది. ప్రజారోగ్యం దృష్ట్యా తాము ఇంటి నుంచే పనిచేయాలని తమ ఉద్యోగులను ఆదేశించామని గూగుల్ వివరించింది.

Related posts