telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

అసత్య వార్తలకు.. యూట్యూబ్ లోనూ చెక్..

youtube logo

అసత్య వార్తలను అరికట్టడమే లక్ష్యంగా, ఎన్నికలకు సంబంధించి తప్పుడు సమాచారం పోస్ట్‌ చేయడాన్ని యూట్యూబ్‌ లో నిషేధించనున్నట్లు గూగుల్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు మరణించారనిగానీ, ఎన్నికల తేదీ వ్యవహారంలో తప్పుడు సమాచారంగానీ యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తే దాన్ని తొలగిస్తామని ఆ సంస్థ చెప్పింది. తాము నియమించిన ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ టీమ్‌లు ఆయా వీడియోలను నిరంతరం పరిశీలిస్తుంటాయని చెప్పింది. వార్తలకు నమ్మదగిన స్థానం కలిగిన దానిగా యూట్యూబ్‌ను మార్చనున్నట్లు తెలిపింది.

గత కొన్నేళ్లుగా వార్తా సమాచారానికి విశ్వసనీయ సోర్స్‌గా యూట్యూబ్‌ను తీర్చిదిద్దేందుకు కసరత్తు ముమ్మరం చేశాం. అదే సమయంలో ఆరోగ్యకరమైన రాజకీయ చర్చలకు బహిరంగ వేదికగా మలిచేందుకు కృషి చేస్తున్నామ’ని యూట్యూబ్‌ ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్‌ పాలసీ వైస్‌ ప్రెసిడెంట్‌ లెస్లీ మిల్లర్‌ పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ వివక్ష తొలగించేందుకు టెక్‌ కంపెనీలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా కృత్రిమ మేధస్సు దుర్వినియోగంతో వీక్షకులను తప్పుదారి పట్టించే వీడియోలను తొలగించనున్నట్టు గత నెలలో ఫేస్‌బుక్‌ ప్రకటించింది. ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలను నిషేధిస్తున్నామని ట్విటర్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related posts