telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మినీ బస్సు చక్రాల కింద మహిళ… అది చూసి వాళ్ళు ఏం చేశారంటే…

East China

తూర్పు చైనాలోని సుకియాన్ నగరంలో గత గురువారం ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ మహిళను వెనక నుంచి వచ్చిన మినీ బస్సు ఢీకొట్టింది. దాంతో ఆమె ఆ బస్సు కింద ఇరుక్కొవడంతో డ్రైవర్ వెంటనే వాహనాన్ని నిలిపివేశారు. అయితే మహిళ బస్సు కింద ఇరుక్కుపోవడం గమనించిన అక్కడి నుంచి వెళ్తున్న వాహనదారులు, పాదచారులు వెంటనే స్పందించారు. తలో చేయివేసి మినీ బస్సును అమాంతం పైకి లేపి మహిళను బయటకు తీశారు. అనంతరం ఆమెను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పెద్దగా గాయాలు కాకపోవడంతో మహిళ ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో కాస్తా బయటకు రావడంతో చైనీస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.

Related posts