telugu navyamedia
ఆరోగ్యం

ఆయిల్‌ పుల్లింగ్ తో ఆరోగ్యం..

ఆయిల్ పుల్లింగ్..అనేది ఒక పురాతన ఆయుర్వేద దంత చికిత్స. 500 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉద్భవించిన ఈ టెక్నిక్ తో నోట్లోని బ్యాక్టీరియాను అంతం చేయవచ్చు. కాబట్టే మన పూర్వీకులు కూడా.. ఈ పద్ధతిని పాటించేవాళ్లు. ఈ ప్రక్రియ నోటి వరకే పరిమితం అయినప్పటికీ.. శరీరంలోపలి భాగాలను ఆరోగ్యంగా మారుస్తాయి.

అలాగే నోరు శుభ్రంగా మారుతుంది. ఆయిల్ పుల్లింగ్ కి ఉపయోగించే నూనెల వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు..ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండ‌ద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కొబ్బరినూనె, ఆలివ్ నూనె, నువ్వుల నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్ ని ఆయిల్ పుల్లింగ్ కి ఉపయోగించవచ్చు. 15 నుంచి 20 నిమిషాల ఆయిల్ పుల్లింగ్ చేస్తే చాలు.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. కాకపోతే.. వీటిని ఎట్టిపరిస్థితుల్లో మింగకూడదు.

Oil Pulling: Benefits & Side Effects | Live Science

ఆయిల్ పుల్లింగ్ వ‌ల‌న నోటికి మంచి ఎక్స‌ర్‌సైజు అవుతుంది. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని నోరంతా తిప్పుతూ పుక్కిలిస్తున్నట్లు చేయాలి. ఈ క‌ద‌లిక వ‌ల‌న‌ సైనాసిటిస్‌కు మంచి ఉప‌యోగ‌ప‌డుతుంది. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల నోటిలో మూలలలో ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది. చిగుళ్లు, దంతాలు ఇన్‌ఫెక్ష‌న్స్ త‌గ్గి ఆరోగ్యంగా ఉంటాయి.

మన నోట్లో దాదాపుగా 600 రకాల బాక్టీరియా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ ఆయిల్‌ పుల్లింగ్‌ చేస్తే నోటి దుర్వాస‌న, చిగుళ్లు వాపు పోతుంది. ఆయిల్‌ పుల్లింగ్ ద్వారా ద‌వ‌డ‌ల‌కు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రిగి ముఖం స్కిన్‌ గ్లో అవుతుంది.

వాస్త‌వానికి మిగతా వైద్య విధానాలతో పోల్చుకుంటే ఆయిల్ పుల్లింగ్ మీద జరిగిన పరిశోధనలు తక్కువ. ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల నోటి ఆరోగ్యం (ఓరల్ హైజీన్) కాస్తో కూస్తో మెరుగుపడుతుందని ఈ పరిశోధనల్లో తేలింది .తీవ్రమైన వ్యాధులు ఉన్నవారు తమ సమస్యలు ఆయిల్ పుల్లింగ్‌తో తీరిపోతాయనుకుంటే కష్టమే! ..

Related posts