telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సామాజిక

జులై మొదటి వారంలోనే.. గోల్కొండ మహాకాళి బోనాలు…

golkonda mahankali bojalu in july first week

శ్రీ జగదాంబిక మహాకాళి అమ్మవారి బోనాల(చారిత్రాత్మక కట్టడం గోల్కొండ) ఉత్సవాలకు సమయం దగ్గరికొచ్చింది. వచ్చే నెల 4న ప్రారంభమై నెల రోజులపాటు బోనాలు సాగనున్నాయి. ఉత్సవాల కోసం దేవాదాయ, ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే పనులు ప్రారంభించారు. ఈవో మహేందర్‌కుమార్‌ ఆధ్వర్యంలో కరపత్రాల తయారీతోపాటు ఆయా విభాగాల అధికారులకు లెటర్‌ ప్యాడ్‌పై వినతిపత్రాలను ఇప్పటికే పూర్తయింది. ఆగస్టు ఒకటి వరకు జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆలయానికి రంగులు వేయడం, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడం కోసం ఆర్‌ అండ్‌ బీ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

ఇప్పటివరకు ఉత్సవాల నిర్వహణకు దేవాదాయ, ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో ట్రస్టుబోర్డు కమిటీని రెండు, మూడు నెలల క్రితమే ఏర్పాటు చేసేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వ హయాం లో ట్రస్టు బోర్డు కమిటీ అనే పదానికే అర్థం లేకుండా పోతోంది. ఉత్సవాలకు ఒకటి, రెండ్రోజుల ముందు తూ.తూ.మంత్రంగా నిర్వహణ కమిటీని ప్రకటిస్తున్నారు. ఈసారీ అదే పరిస్థితి నెలకొంది. అందుకు సంబంధించి కార్వాన్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ఠాకూర్‌ జీవన్‌సింగ్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల క్రితం ఉత్సవ కమిటీ ఏర్పాటుకు అవసరమైన సభ్యుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రతిసారీ పది మందికిలోపే కమిటీలో ఉండేవారు. ఈసారి స్థానం కోసం పోటీ పెరగడంతో 11కి పెంచినట్లు తెలిసింది. అందులో సగానికిపైగా గత కమిటీ సభ్యులుగా ఉన్నవారే మళ్లీ చేరుతున్నారు. దాంతో కొత్తవారికి అవకాశానికి దూరమవుతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఉత్సవాల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఠాకూర్‌ జీవన్‌సింగ్‌ తెలిపారు. ఈ కమిటీలో ఛైర్మన్‌గా గోపిరెడ్డి వసంతరెడ్డితోపాటు మరో పది మంది ఉన్నట్లు తెలపారు.

Related posts