telugu navyamedia
telugu cinema news

రెండు రోజుల షూటింగ్ కోసం ఏకంగా బంగారు సెట్…!?

Shankar-and-kamal-Hassan

సౌత్ లో భారీ చిత్రమనగానే గుర్తొచ్చేది దర్శకుడు శంకర్. భారతీయుడు, రోబో, ఐ, 2.0 లాంటి భారీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శంకర్. తాజాగా రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో శంకర్ రూపొందించిన “2 పాయింట్ 0” చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు తన తదుపరి చిత్రమైన “భారతీయుడు-2″పై దృష్టి సారించారు. భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ కథానాయకుడుగా నటిస్తుండగా… ఈ సినిమా కోసం భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. కేవలం సెట్ కోసమే ఏకంగా 2 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. సెట్ కోసం భారీగా ఖర్చు పెట్టడం అనేది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సాధారణమే…!

అయితే విశేషమేమంటే శంకర్ ఈ సెట్ మొత్తాన్ని గోల్డ్ తో నింపబోతున్నారట. దీంతో ఈ సెట్ మొత్తం బంగారు కాంతులతో తళతళలాడుతూ ఉంటుందన్నమాట. దానికి కావాల్సిన మెటీరియల్ ను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారట. ఇప్పటికే సదరు మెటీరియల్ కోసం చైనాలోని సంస్థలకు ఆర్డర్ ఇచ్చారట నిర్మాతలు. ఇంత భారీగా నిర్మిస్తున్న ఈ అద్భుతమైన సెట్లో సినిమాలోని కీలకమైన సన్నివేశాలను రెండు రోజులు మాత్రమే షూటింగ్ జరపనున్నారట.

Related posts

“ప్రేమ హృదయం”..

vimala p

“మారి-2” తెలుగు ట్రైలర్

vimala p

బాలీవుడ్ లోకి కపిల్ దేవ్ కుమార్తె ఎంట్రీ

vimala p