telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

భారీగా పెరగనున్న .. బంగారం ధరలు..

gold and silver prices in markets

ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు, దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీన పడటం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పసిడి కొనుగోళ్లు వంటి అంశాల కారణంగా పసిడి ధర సమీప భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే డిసెంబర్‌ నాటికి బంగారం ధరలు 42 వేల మార్క్‌ను చేరే అవకాశం ఉందని ట్రేడ్‌ విశ్లేషకులు చెపుతున్నారు. డిసెంబర్‌ నాటికి అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ కమోడిటీ మార్కెట్‌ నైమెక్స్‌లో ఒక ఔన్స్‌ బంగారం ధర 1,650 డాలర్లకు చేరవచ్చు అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో బంగారం ధరలను దేశీయంగా పరుగులు పెట్టే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. తాజాగా పండుగల సీజన్‌ ముగిసిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లో పసిడి ధర రూ.548 మేర తగ్గిం దాదాపు రూ.38,857 వద్ల నిలిచింది. ఈ తగ్గుదల తాత్కాలికమేనని.. రానున్న రోజుల్లో బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పెట్టుబడి దారులకు ఇది కలిసివచ్చే కాలమైనా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు అబిప్రాయపడుతున్నారు.

Related posts