telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

పదిగ్రాముల బంగారం ధర … 45వేలు మించనుందా … !!

gold and silver prices in markets

దేశీయ అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి గత కొన్ని రోజులు గా ధరలు పెరుగుతునే ఉన్నాయి. త్వరలో పది గ్రాముల బంగారం ధర నలభై వేలకు చేరుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే బంగారం ఇక అందని ద్రాక్షగా మిగులుతుంది. అసలు పసిడి ధర ఎందుకు పెరుగుతుంది ఇంకా ఎంత వరకూ పెరగవచ్చు తగ్గటానికి అవకాశముందా ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చా లేదా అనే ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. ఈ పరిస్థితికి ముఖ్య కారణాలు అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చడం, పలు దేశాల్లో రాజకీయ అనిశ్చిత పరిస్థితులు కూడా కారణం గా ఉన్నాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వు దశాబ్ద కాలం తర్వాత వడ్డీ రేట్లను తగ్గించింది. మరింతగా తగ్గించడాని కి అవకాశముందని సంకేతాలిచ్చింది.

ఈ నేపథ్యం లో ప్రపంచ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల రక్షణ కోసం బంగారాన్ని నమ్ముకుంటున్నారు, పెట్టుబడులను పసిడి లోకి మారుస్తున్నారు. ఇది ధరల పెరుగుదలకు దారి తీస్తోంది అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగే ధరలకు అనుగుణంగా మన దేశంలోనూ ధరల మారుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో బంగారం ధర నలభై ఐదు వేల రూపాయల వరకు చేరవచ్చు ఇందుకు చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం ఒక కారణమైతే దేశీయ స్టాక్ మార్కెట్ లు మరో కారణం అని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ధరల పెరుగుదల కారణం గా కొనుగోళ్లు ఇరవై నుంచి ముప్పై శాతం వరకు తగ్గే అవకాశముంది ధరలు కూడా ఇప్పట్లో తగ్గే అవకాశం వుండకపోవచ్చు అని మార్కెట్ విశ్లేషకులు తెలుపుతున్నారు.

Related posts