telugu navyamedia
వ్యాపార వార్తలు

మ‌గువ‌ల‌కు గుడ్‌న్యూస్‌..

మ‌ళ్ళీ త‌గ్గిన ప‌సిడి

బంగారం అంటే ఇష్టం లేని వారు ఉండ‌రు. అంద‌లో మ‌గువ‌ల‌కు మ‌రింత‌.. అందుకే మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంది. అక్ష‌య తృతియ అని, పండ‌గ‌ల‌ని, వ్ర‌తాలు, పూజ‌లని కొంటూనే ఉంటారు. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే… గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి.

హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 100 తగ్గి రూ. 44,800 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 100 తగ్గి రూ. 48,880కి చేరిది.

అలాగే విశాఖ ప‌ట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ 4,479 ఉండ‌గా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ 4,887 ఉన్నాయి. వెండి ధ‌ర‌లు అలాగే కొన‌సాగుతున్నాయి.

దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవ‌డంతో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డుతున్నాయి. ఇక బంగారం ధ‌ర‌లు దారిలోనే వెండి ధ‌ర‌లు కూడా తగ్గిపోయాయి. కిలో వెండి ధ‌ర రూ. 800 తగ్గి రూ. 72,300 వ‌ద్ద కొనసాగుతోంది.

Related posts