telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

గుడ్ న్యూస్… దిగొచ్చిన బంగారం ధర

gold

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి కొంత ఊరట. నిన్న దిమ్మతిరిగే షాకిచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం కొంత మేర దిగొచ్చింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి కూడా తగ్గింది. బంగారం ధర దిగిరావడానికి ప్రాఫిట్ బుకింగ్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పసిడి ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరడం వల్ల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. అలాగే ఈక్విటీ మార్కెట్లు లాభపడటం కూడా పసిడిపై ప్రభావం చూపింది. అయితే రూపాయి బలహీనంగానే ఉండటం వల్ల బంగారం ధర తగ్గుదల పరిమితంగానే ఉందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర దిగొచ్చింది. రూ.170 మేర పడిపోయింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.45,310 నుంచి రూ.45,140కు తగ్గింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా క్షీణించింది. ఇది కూడా రూ.170 మేర తగ్గింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు రూ.41,530 నుంచి రూ.41,360కు క్షీణించింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది కొంత ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా తగ్గింది. కేజీ వెండి ధర రూ.180 మేర క్షీణించింది. దీంతో కేజీ వెండి ధర రూ.50,030 నుంచి రూ.49,850కు తగ్గింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం పెరిగింది. 1,650 డాలర్ల పైన కదలాడుతోంది. బంగారం ధర ఔన్స్‌కు 0.50 శాతం పెరుగుదలతో 1651.25 డాలర్లకు పరుగులు పెట్టింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.41 శాతం పెరుగుదలతో 17.32 డాలర్లకు చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.41,360కు క్షీణించింది. వెండి ధర కూడా రూ.180 తగ్గుదలతో రూ.49,850కు దిగొచ్చింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర తగ్గింది. రూ.150 మేర క్షీణించింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.42,400 నుంచి రూ.42,250కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 క్షీణతతో రూ.43,600 నుంచి రూ.43,450కు తగ్గింది. ఇక వెండి ధర కూడా రూ.180 తగ్గుదలతో రూ.49,850కు క్షీణించింది. బంగారం ధర పరిస్థితులకు అనుగుణంగా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో స్థిరంగా కూడా ఉండొచ్చు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related posts