telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బంగారం నిల్వపై .. కేంద్రం పరిమితి .. త్వరలో గోల్డ్ బోర్డు..

gold and silver prices in markets

కేంద్రప్రభుతం మరొ కీలక నిర్ణయం తెరపైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. బంగారం అంటే సాంప్రదాయంగా భావించే దేశీయ వినియోగదారుల వద్ద వుండే బంగారం నిల్వపై పరిమితిని విధించేందుకు మోదీ సర్కార్‌ సన్నద్ధమవుతోంది. బంగారాన్ని చట్టబద్ధం చేసే లక్ష్యంతో గోల్డ్‌బోర్డు పేరుతో ఒక బోర్డును ఏర్పాటు చేయనుంది. ఈ పథకం ప్రకారం ఒక వ్యక్తి లేదా కుటుంబానికి పరిమితి మించి బంగారం ఉండొద్దట. పరిమితికి మించి బంగారం వినియోగంలో ఉన్నట్టయితే ఆ అధిక బంగారానికి పన్నుతో సహా, జరిమానా కూడా విధిస్తారట. వివాహిత మహిళలను ఈ పథకం నుంచి కొంతమేరకు మినహాయించనున్నట్లు సమాచారం. ఈ పథకం గనక అమలు అయితే బంగారం కొనే వాళ్ళు తగ్గిపోతారని అంటున్నారు.

ఇప్పటికే బంగారం అమ్మకాలు చాలా వరకు తగ్గిపోయాయి. సెప్టెంబరు మాసంలో బంగారం దిగుమతి క్షీణించడం లాంటి పరిణామాలు నగల వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ధంతేరస్ లాంటి సమయాల్లో కూడా బంగారం అమ్మకాలు పెరగలేదు. దీనికి తోడు ఈ పథకం కూడా తోడైతే బంగారం ధరలు తగ్గుతాయని వ్యాపారుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఈ విషయం అటుంచితే, అసలు బంగారాన్ని ఎలా లెక్కిస్తారనే ప్రశ్న మొదలైంది. అలా లెక్కించడం సాధ్యమేనా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మరి ఈ నిర్ణయం తీసుకుంటే బంగారం ధరలు తగ్గుతాయని కొందరు అంటుంటే, ఈ నిర్ణయం వల్ల నల్లధనం బయటకి వస్తుందని అంటున్నారు. నల్లధనం బయటకు తీసే క్రమంలో గతంలో పెద్ద నోట్లు రద్దు తరహాలో ఈ నిర్ణయం తీసుకుని, నగదును బంగారంగా మార్చి నిల్వ ఉంచిన వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పెద్దనోట్ల రద్దు తరహాలో ఇది కూడా తుస్ మంటుందా లేక దీనివలన అయినా నల్ల తాచులు బయటకు వస్తాయా అన్నది సమాధానం దొరకని ప్రశ్నే!!

Related posts