telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

గుడ్‌ న్యూస్‌ : తగ్గిన బంగారం, వెండి ధరలు !

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం ధరలు ఇవాళ కూడాపెరిగిపోయాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీ, హైదరాబాద్ లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. కరోనా అనంతరం 50 వేల ను దాటిన బంగారం ఇప్పుడు మొదటిసారి కిందకి దిగ్గి వచ్చింది. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 170 తగ్గి రూ. 52,630 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 150 తగ్గి రూ. 48,250 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 50,460కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ.46,100 పలుకుతోంది. ఇక బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం భారీగా తగ్గిపోయాయి. కిలో వెండి ధర రూ.1100 తగ్గి…రూ.71,400కు చేరుకుంది.

Related posts