telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

స్థిరంగా బంగారం.. భారీగా పడిపోయిన వెండి ధరలు

మనదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే…తాజాగా బులియన్‌ మార్కెట్‌లో రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు తాజాగా స్థిరంగా ఉండిపోయింది. అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,450 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,410 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 46,100 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,260 పలుకుతోంది. బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధరలు మాత్రం భారీగానే తగ్గిపోయాయి. కిలో వెండి ధర రూ. 410 తగ్గి రూ. 69,300 వద్ద కొనసాగుతోంది.

Related posts