telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

బ్యాడ్ న్యూస్: పెరిగిన బంగారం ధరలు

బులియన్‌ మార్కెట్‌లో గత నాలుగు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగింది. దేశ రాజధానితో పాటు హైదరాబాద్‌లోనూ వెండి ధర భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ లలో బంగారం ధర రూ. 250 మేర తగ్గింది. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 పెరిగి రూ. 49,430 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 45,400 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గిపోయాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 పెరిగి రూ. 47,180 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 43,250 పలుకుతోంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా ఇవాళ భారీగాపెరిగాయి. కిలో వెండి ధర మార్కెట్లో ఏకంగా రూ. 400 పెరిగింది. కిలో వెండి ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 73, 800 వద్ద ఉన్నది.

Related posts