telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మహిళలకు గుడ్‌న్యూస్ః భారీగా తగ్గిన బంగారం ధ‌ర‌లు…

బంగారానికి ఎప్పుడు డిమాండ్ తగ్గదు. ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు బంగారం. ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. దీంతో మన దేశంలో బంగారం ధరలు ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి. అందుకే కరోనా టైంలోనూ బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే…బులియన్‌ మార్కెట్‌లో వారం రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు తాజాగా తగ్గాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ.47,890 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 తగ్గి రూ. 43,900 పలుకుతోంది. ఇక బంగారం ధ‌ర‌లు త‌గ్గినప్పటికీ వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పులు ఉండ‌టం లేదు. కిలో బంగారం ధ‌ర రూ. 73,100 వ‌ద్ద స్థిరంగా ఉన్నది.

Related posts