telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

తూర్పుగోదావరి బోటు ప్రమాదంలో ఆగిన ఆపరేషన్ రాయల్ వశిష్ట… కాకినాడ టీమ్‌కు బాధ్యతలు

boat bringing attempt failed

తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు దగ్గర గోదావరిలో మునిగిన బోటును బయటకు తీసేందుకు కొనసాగుతున్న ఆపరేషన్ రాయల్ వశిష్ట నిలిచిపోయింది. ఒడ్డుకు రావాలని ధర్మాడి సత్యం టీమ్‌ను అధికారులు ఆదేశించారు. లంగర్ వేసి బోటు తీసేందుకు ధర్మాడి సత్యం టీమ్ ప్రయత్నిస్తోంది.. అయితే లంగర్‌తో ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలో ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ధర్మాడి సత్యం టీమ్ అయోమయంలో ఉంది. అయితే బోటు తీసేందుకు కాకినాడ టీమ్ రానున్నట్లు అధికారుల చెబుతున్నారట. బోటు వెలికితీసే పనుల నిలిపివేయడం ఆసక్తికరంగా మారింది. మూడు రోజులుగా ధర్మాడి సత్యం టీమ్ బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో బుధవారం వేసిన పెద్ద లంగరుకు బలమైన ఓ వస్తువు తగిలింది. అది బోటు అని సత్యం టీమ్ భావించింది. రోప్‌ల సాయంతో దానిని బయటకు లాగుతున్నారు.. రోప్ మరింత బిగియడంతో జేసీబీల సాయంతో బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. గురువారం కూడా అదే ప్రయత్నాన్ని కొనసాగించారు.

రెండు వారాల క్రితం సత్యం టీమ్ బోటును బయటకు తీసేందుకు ప్రయత్నించింది. అప్పుడూ కూడా బలమైన వస్తువుకు లంగర్ తగిలింది.. అది బోటుగా భావించినా ఫలితం దక్కలేదు. దాదాపు నాలుగైదు రోజుల పాటూ ప్రయత్నాలు కొనసాగాయి.. ఆ వెంటనే గోదావరికి వరద ఉధృతి పెరగడంతో బోటు బయటకు తీసే ప్రయత్నాలు టీమ్ తాత్కాలికంగా నిలిపివేశారు. వరద తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించారు. బోటు మునిగిన కొద్దిరోజులకు ముంబై, ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన స్పెషల్ టీమ్‌లు బయటకు తీసేందుకు ప్రయత్నించాయి. టెక్నాలజీ సాయంతో బోటును ఎలాగైనా బయటకు తీసుకురావాలని చూశారు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో.. చివరిగా ధర్మాడి సత్యం టీమ్‌కి ఈ బాధ్యతల్ని అప్పగించారు. ప్రభుత్వం రూ.22 లక్షల కాంట్రాక్ట్‌ చేసుకున్న సంగగతి తెలిసిందే.

Related posts