telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

గాలింపు చర్యలు ముమ్మరం.. మరో 4 మృతదేహాల వెలికితీత

tourisam boat

గోదావరి నదిలో రెస్క్యూ టీమ్స్ ముమ్మరం గాలింపు చర్యలను చేపట్టింది. నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది ఈ ఉదయం మళ్లీ సహాయక చర్యలు ప్రారంభించారు. ముంపు ప్రమాద ఘటనలో మరో 4 మృతదేహాలను వెలికితీశారు. కచ్చులూరు సమీపంలో 4 మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు గుర్తించాయి. దీంతో మృతదేహాల సంఖ్య 12 కి చేరింది.

మరోవైపు, గోదావరిలో గల్లంతైన వారి కోసం గాలింపును ముమ్మరం చేసిన అధికారులు మృతదేహాలు సముద్రంలోకి కొట్టుకుపోకుండా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద అన్ని గేట్లనూ కిందకు దించారు. మృతదేహాలు నీటిపైనే కొట్టుకు వస్తాయి కాబట్టి, నీటి మట్టానికి కాస్తంత దిగువ వరకూ గేట్లను మూసివేయాలని పై అధికారుల నుంచి ఆదేశాలు అందినట్టు జలాశయం ఉద్యోగులు వెల్లడించారు.

Related posts