telugu navyamedia
వార్తలు

మేక పాల‌కు ఇంత డిమాండా..?

యూపీలో మేకపాలకు డిమాండ్ అమాంతం పెరిగింది. మొననటి వరకు రూ.50కి అమ్ముడుపోయిన మేకపాలు.. ఇప్పుడు ఏకంగా లీటరు రూ.1500కు అమ్ముతున్నారు. అసలు ఒక్కసారిగా మేకపాల ధర ఇంతలా పెరగడానికి కారణమేంటా అని ఆరా తీస్తే.. డెంగ్యూనే కారణం ఏంటని అనుకుంటున్నారా..?. డెంగ్యూ.

మొన్నటి వరకు ఉత్తరప్రదేశ్ లో డెంగ్యూ జ్వ‌రాలు ప‌ట్టి పీడించాయి. వందల సంఖ్య జనాలు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి శరీరం మీద డెంగ్యూ అటాక్ చేసిందంటే ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గించి చూస్తుండగానే రోగి ప్రాణాలు విడుస్తాడు. అయితే.. మేకపాల వల్ల ప్లేట్ లెట్లు వేగంగా పెరుగుతాయని జరిగిన ప్రచారం వల్ల జనం ఒక్కసారిగా మేకపాల కోసం పోటీ పడ్డారు. దీంతో ధర ఉన్నట్టుండి విపరీతంగా పెరిగిపోయింది.

గత నెల వరకు కేవలం రూ.50 ఉన్న మేకపాలు.. డిమాండ్ పెరగడంతో రూ.1500కు తక్కువ అమ్మడం లేదు. స్థానిక ఆయుర్వేద వైద్యులు మేకపాలతో వైద్యం చేయడం, మేకపాల ద్వారా ప్లేట్ లెట్లు పెరుగుతాయని చెప్పడంతో జనాలంతా మేకపాల కోసం పోటీ పడ్డారు. అయితే.. మేకపాల వల్ల ప్లేట్ లెట్లు పెరుగుతాయని ఎక్కడ శాస్త్రీయంగా రుజువు కాలేదని వైద్యులు చెప్తున్నారు. మేకపాలు తాగితే డెంగ్యూ జ్వరం తగ్గుతుందని కూడా వైద్యపరంగా ఎక్కడ రుజువు కాలేదు.

Related posts