telugu navyamedia
రాజకీయ

రాహుల్ భారత్ జోడో యాత్ర : కాంగ్రెస్‌కు పెద్ద షాక్

భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్‌కు పునర్‌వైభవం తీసుకురావాలని రాహుల్ గాంధీ భావిస్తుంటే ఆ పార్టీకిి గోవా లో పెద్ద షాక్ ఇచ్చింది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా 8 మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు.

గోవాలో కాంగ్రెస్​కు షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్​.. కండువ కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు ప్రమోద్ సావంత్ . “భారత్ జోడో అంటూ కాంగ్రెస్ యాత్ర ప్రారంభించింది. కానీ, గోవాలో ‘కాంగ్రెస్ ఛోడో’ కార్యక్రమం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి భాజపాలో చేరుతున్నారు” అని వ్యాఖ్యానించారు.

 

అంతకుముందు ఎమ్మెల్యేలు సీఎం, అసెంబ్లీ స్పీకర్​తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ శాసనపక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలని ఎమ్మెల్యేలు తీర్మానించారు. విపక్ష నేతగా ఉన్న మైఖెల్ లోబో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీన్ని మాజీ సీఎం, ఎమ్మెల్యే దిగంభర్ కామత్ బలపర్చగా.. మిగ‌తా ఎమ్మెల్యేలు ఆమోదించారు.

అనంతరం, సీఎం ప్రమోద్ సావంత్​తో కలిసి ఎమ్మెల్యేలు ఫోటోలు దిగారు. ఈ ఫొటోలు వెంటనే సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పార్టీ మారిన వారిలో దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, దెలీలా లోబో, రాజేష్ ఫాల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సో సిక్వేరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్ ​లు ఉన్నారు.

గోవా అసెంబ్లీలో మొత్తం 40 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో భాజపాకు 20 మంది, కాంగ్రెస్‌కు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మందిలో 8 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం బీజేపీలోకి జంప్ అవనున్నారు.

ఇక 2019లో 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 10 మంది బీజేపీలో చేరారు. గోవా అసెంబ్లీ సమావేశానికి ఒక రోజు ముందు కాంగ్రెస్‌ పార్టీ సమావేశం ఏర్పాటు చేయగా.. ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. త్వరలోనే వారంతా బీజేపీలో చేరతారన్న వార్తలు గుప్పుమన్నాయి

Related posts