• Home
  • వార్తలు
  • దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా 48 గంటలు ఇంటర్నెట్ పనిచేదట… సీఆర్ఏ
Trending Today వార్తలు సాంకేతిక

దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా 48 గంటలు ఇంటర్నెట్ పనిచేదట… సీఆర్ఏ

Global Internet Shutdown in Next 48 hours CRA

కీలకమైన డొమైన్ సర్వర్లకు మెయింటనెన్స్ పనులు జరుగనున్నడంతో రానున్న 48 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రష్యా టుడే ఓ ప్రకటనలో పేర్కొంది.. ఈ మెయింటనెన్స్ పనుల్లో భాగంగా కొద్ది సేపు పూర్తిగా నెట్వర్క్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, సైబర్ దాడులు పెరిగిపోతున్న సమయంలో ఇంటర్నెట్ అడ్రెస్ బుక్ లేదా డొమైన్ నేమ్ సిస్టమ్ (డీఎన్ఎస్)కు భద్రత కల్పించడంలో భాగంగా ది ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ఐసీఏఎన్ఎన్) ఈ పని చేపడుతున్నదని తెలిపింది…

ఇందులో భాగంగా డీఎన్ఎస్ కు రక్షణ కల్పించే క్రిప్టోగ్రాఫిక్ కీను మార్చనున్నారు. డీఎన్ఎస్ స్థిరంగా, భద్రంగా ఉండాలంటే ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం తప్పనిసరి అని కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (సీఆర్ఏ) ఓ ప్రకటనలో వెల్లడించింది…. ఈ మార్పునకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు సిద్ధంగా లేకపోతే వాళ్ల కస్టమర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని స్పష్టంచేసింది. దీనితో రానున్న 48 గంటల్లో ఆన్ లైన్ లావాదేవీలు, ఇతర ఇంటర్నెట్ సర్వీసులకు ఇబ్బందులు తప్పవని సీఆర్ఏ తెలిపింది. ఇక అవుట్ డేటెడ్ ఐఎస్పీ వాడుతున్న యూజర్లకు కూడా గ్లోబల్ నెట్వర్క్ ను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది ఉంటుందని ఆ ప్రకటనలో ఉంది.

Related posts

ఎన్టీఆర్ కు సవాల్ విసిరిన రామ్ గోపాల్ వర్మ… షాక్ లో అరవింద సామెత టీం

nagaraj chanti

ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.. కానీ రెండు నెలలకే ఇలా మోసం

nagaraj chanti

స్టెర్లిన్ బయోటెక్ అధినేత నితిన్…నైజీరియాలో తల దాచుకున్నాడట…

chandra sekkhar

Leave a Comment