telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ప్రతిరోజూ పండగే” టీజర్… ఫ్యాన్స్ కు పుట్టినరోజు ట్రీట్…!

PP

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ నటించిన “చిత్ర‌ల‌హ‌రి” ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం ఇచ్చిన బూస్ట్ తో సాయిధరమ్ తేజ్ చేస్తున్న త‌ర్వాత చిత్రం “ప్రతిరోజు పండగే”. ఈ చిత్రానికి మారుతి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. “ప్ర‌తిరోజు పండ‌గే” అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన రాశి ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స‌రికొత్త లుక్‌లో తేజూ క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తవ్వగానే చిత్ర బృందం అమెరికా వెళ్లనున్నారు. అమెరికా షెడ్యూల్‌లో చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. కాగా అక్టోబర్ 15న హీరో సాయి తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సాయి తేజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ప్రతిరోజూ పండగే’ చిత్రయూనిట్ టీజర్ ను విడుదల చేశారు. ఈరోజు 33వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.ఈ సందర్భంగా సందర్భంగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts