telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సామాజిక

చెత్తతో.. ఛాయ్.. ఇదోరకమైన బార్టర్ సిస్టం..

give waste and take chai machine

ఒక్కో వేడుక ఒక్కో పాఠాన్ని నేర్పిస్తుంది. వేడుక అంటేనే దానిలో పాల్గొనే వారి సంఖ్య భారీగా ఉంటుంది. మరి ఎక్కువ మంది ఒక్కచోట చేరితే అదే స్థాయిలో వేస్ట్(చెత్త) కూడా పోగవుతుంది. వేడుక అయిపోగానే అందరూ ఎటోళ్లు అటు వెళ్ళిపోతారు.. మిగిలేది టన్నులకొద్దీ చెత్త మాత్రమే. దానిని శుభ్రం చేసేసరికి సరిపోతుంది. అందుకే కాస్త వినూత్నంగా ఆలోచించి, ఒక్క బుల్లెట్ కి రెండు పక్షులు అన్న చందాన.. కుంభమేళాలో సరికొత్తగా ఛాయ్ అందుబాటులోకి తెచ్చారు. కానీ ఇది తాగాలంటే నగదు అవసరం లేదు, మీరు ఉపయోగించి పడేసే సామాగ్రి ఏదైనా ఆ ఛాయ్ మెషిన్ లో వేస్తె, అది మీకు వేడివేడి ఛాయ్ ఇస్తుంది. భలే ఛాయ్ మెషిన్ కదూ.

కుంభ మేళాకు తరలివస్తున్న భక్తులను ఏటీఎం లాంటి ఛాయ్ మెషిన్ ఆకట్టుకుంటోంది. చలి తీవ్రత కారణంగా ఛాయ్ తాగితే బాగుండు అనుకునేవారు ఈ యంత్రం చూసి హమ్మయ్య అనుకుంటున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా కుంభ మేళాలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ఛాయ్ ఏటీఎం పలువుర్ని ఆకర్షిస్తోంది. చెత్త వేస్తే చాలు. గరం గరం ఛాయ్ అందిస్తోంది ఈ యంత్రం.

కోట్లాదిమంది భక్తులు తరలివచ్చే కుంభ మేళాలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఛాయ్ యంత్రం ప్రవేశపెట్టారు. చెత్త గానీ వాటర్ బాటిళ్లు గానీ ఈ మెషిన్ లో వేస్తే.. గరం గరం ఛాయ్ ఇస్తుంది. కుంభమేళాలో క్లీన్ తో పాటు పర్యావరణం కాపాడే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ యంత్రాన్ని భక్తులు బాగానే వాడుతున్నారట. సాధారణంగా జాతర లాంటి ప్రదేశాల్లో ఆహార పదార్థాల కవర్లు, వాటర్ బాటిళ్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. అయితే అలాంటి పరిస్థితి కుంభ మేళాలో కనిపించొద్దనే ఉద్దేశంతో ఈ ఛాయ్ మెషిన్లు తెరపైకి తెచ్చారు. వాళ్ళ ఆలోచన ఫలించినట్టే ఉంది. ఛాయ్ కోసం చెత్తను తీసుకొచ్చి మరి మెషిన్ లో వేస్తున్నారు. రోజుకు 1500 వరకు టీ కప్పులు వినియోగం జరుగుతున్నట్లు తెలిపారు. జనవరి 15న ప్రయాగ్ రాజ్ లో మొదలైన అర్థ కుంభ మేళా మార్చి 4 వరకు కొనసాగనుంది. దాదాపు 10 నుంచి 15 కోట్ల మంది వరకు కుంభ మేళాకు హాజరవుతారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

అది రూపొందించిన వారి అందరికి .. అభినందనలు తెలపండి. అది వారికి ప్రోత్సహాన్ని ఇస్తుంది. ఇంకా ఎన్నో అద్భుతాలను కనిపెడతారు. దీనిని రూపొందించింది భారతీయుడైతే ఇంకా సంతోషం.

Related posts