telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

రక్షా బంధన్ ఆఫర్ : స్వీట్ కొంటే మాస్కు ఫ్రీ… ఆ రాష్ట్ర సీఎం ఆదేశాలు

Punjab-CM

రక్షా బంధన్ సందర్భంగా పంజాబ్ రాష్ట్రంలో స్వీట్ కొన్న వాళ్లకు మాస్కు ఫ్రీగా అందిస్తున్నారు. కరోనా కట్టడి కోసం దుకాణాదారులు ఇందుకు సహకరించాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కోరారు. ఆగస్టు 2న రాష్ట్రంలో స్వీట్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించిన సీఎం తరువాత వ్యాపారుల ఎదుట ఈ ప్రతిపాదన పెట్టారు. కొవిడ్-19 లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ రక్షా బంధన్ సందర్భంగా స్వీట్ షాపులు తెరిచేందుకు సీఎం అనుమతించారు. మరోవైపు స్వీట్ షాపు యజమానులు మాస్కులు ఫ్రీగా ఇవ్వాలని విన్నవించారు. ఈ మేరకు వ్యాపారులను ప్రోత్సహించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే స్థానిక అధికారులను ఆదేశించారు. స్వీట్స్ కొనుగోలు చేసిన వారికి రెండు మాస్కుల చొప్పున ఉచితంగా ఇచ్చేలా చూడాలన్నారు. మాస్కుల వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు, వాటిని తప్పనిసరిగా వినియోగించేలా ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. పంజాబ్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో మాస్కు తప్పనిసరి చేశారు.నిబంధన ఉల్లంగిస్తే రూ. 500 జరిమానా విధిస్తున్నారు. అయినా మాస్కు ధరించకుండా తిరిగే వారు అధిక మవడంతో జరిమానా మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Related posts