telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

రాత్రికి రమ్మన్నాడు, మందుకొట్టి పడుకున్నాడు.. ఇంటికి నిప్పుపెట్టిన యువతి

New couples attack SR Nagar

అర్ధ రాత్రి ఇంటికి రావాల్సిందిగా ప్రియురాలిని ఓ ప్రియుడు ఆహ్వానించాడు. ఆమె ఇంటికి రాగానే తలుపులు తీయకుండా మందుకొట్టి నిద్రపోయాడు. దీంతో చాలాసేపు అక్కడే నిలబడ్డ యువతి, చివరికి సహనం కోల్పోయింది. పెట్రోల్ తీసుకొచ్చి ఇంటిపై పోసి నిప్పంటించింది. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. న్యూజెర్సీలోని వుడ్ బరీలో ఓ యువకుడు, తైజా రస్సెల్(29) అనే యువతికి పరిచయముంది.

ఈ క్రమంలో ఇంటికి రావాలనీ, ఇద్దరం ఎంజాయ్ చేద్దామని సోమవారం అర్ధరాత్రి దాటాక యువకుడు రస్సెల్ కు ఫోన్ చేశాడు. దీంతో ఆమె ఆశగా ఇంటికి చేరుకుంది. ఇంటి దగ్గరకు వచ్చిన రస్సెల్ 8 సార్లు ఫోన్ చేసింది. కానీ అప్పటికే పూటుగా మద్యం సేవించిన యువకుడు నిద్రలోకి జారుకున్నాడు. దీంతో సహనం కోల్పోయిన రస్సెల్ ఇంటిపై పెట్రోల్ చల్లి నిప్పు పెట్టింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటన లో అతనికి కాలిన గాయాలు అయ్యాయి. యువతి రస్సెల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేశారు.

Related posts