telugu navyamedia
సినిమా వార్తలు

గిరీష్ కర్నాడ్ అంత్యక్రియలు

Girish-Karnad

ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ నిన్న బెంగళూరులో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గిరీష్ అంత్యక్రియలను అతని కుటుంబ సభ్యులు బెంగళూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమా పెద్దలెవరూ హాజరుకాలేదు. మీడియా సమాచారం ప్రకారం గిరీష్ కర్నాడ్ అంత్యక్రియలను సంప్రదాయ రీతిలో నిర్వహించలేదు. ఎలక్ట్రానిక్ క్రిమెటోరియం ద్వారా గిరీష్ అంత్యక్రియలు జరిగాయి. కాగా గిరీష్ కర్నాడ్ ఇకలేరనే విషయం తెలియగానే బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ సోషల్ మీడియాలో “గిరీష్ కర్నాడ్ గురించిన వార్త తెలియగానే ఎంతో బాధ కలిగింది. మా ఇద్దరిదీ 43 ఏళ్ల స్నేహ బంధం. అతనికి సంతాపం తెలపాలంటే ఏకాంతం కావాలి” అని పేర్కొన్నారు.

Related posts