telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

రోజు అల్లామా.. అంటారేమో.. అది ఆరోగ్యమే..

ginger tea for all round health

ఆయుర్వేదంలో ఎన్నో దీర్ఘరోగాలు కూడా శాశ్వత పరిష్కారం ఉన్నాడని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వివిధ రసాయనాలను శరీరానికి అందించే వివిధ పదార్దాలు ఆహారంలో చేర్చుకొంటే, కొన్ని జబ్బులు అసలు రాకుండా చూసుకోవచ్చని నిపుణులు చెపుతున్నారు. అందులో అందరికి నప్పేది అంటే, అల్లం. దీనిలో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. అల్లంను నిత్యం మ‌నం కూర‌ల్లో వేస్తుంటాం. తద్వారా కూర‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే రుచికే కాదు, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందివ్వ‌డంలోనూ అల్లం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే అల్లంతో టీ త‌యారు చేసుకుని నిత్యం తీసుకుంటుంటే కలిగే అద్భుత ప్రయోజనాలే వేరు..

* అల్లం టీని తాగి ప్ర‌యాణాలు చేస్తే వాంతులు రాకుండా ఉంటాయి. కొంద‌రికి కార్లు, బ‌స్సుల్లో ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వాంతులు అవుతుంటాయి. అలాంటి వారు ప్ర‌యాణానికి ముందు అల్లం టీ తాగితే ఫ‌లితం ఉంటుంది.

* తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాకుండా స‌మ‌స్య‌లు ఎదుర్కొనేవారు అల్లం టీని తాగితే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌టప‌డ‌వ‌చ్చు.

* కీళ్ల నొప్పులు ఉన్న‌వారు అల్లం టీ తాగితే ఆ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

* అల్లం టీని రోజూ తాగితే ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది.

* రుతుక్ర‌మం స‌రిగ్గా ఉండ‌ని మ‌హిళ‌లు అల్లం టీ తాగితే ఉత్త‌మం. అలాగే శ‌రీర రోగ నిరోధ శ‌క్తి కూడా అల్లం టీతో పెరుగుతుంది.

* బాగా త‌ల‌నొప్పిగా ఉంటే అల్లం టీ తాగితే వెంట‌నే నొప్పి త‌గ్గిపోతుంది.

* అల్లం టీని నిత్యం తాగుతుంటే అధిక బ‌రువు, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

Related posts