telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఈ గుడికి వెళ్లాలంటే .. ధైర్యం ఉండాలట.. దెయ్యాలు..

ghost free temple in rajasthan

మనసు బాగాలేకపోతే గుడికి వెళతాం. అయితే కొన్ని చోట్ల దయ్యాలు వదిలిస్తున్న దేవాలయాలు కూడా ఉండటం అరుదుగా చూస్తుంటాం. అలాంటి చోటుకు వెళ్లాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. సాధారణ దేవాలయాలకు వెళ్లినట్టుగా ఆ దేవాలయాలకు వెళ్లడం అంత తేలికైన పనికాదు. ఆ తరహా దేవాలయం, రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఉన్న ‘శ్రీ మెహందీపూర్ బాలాజీ దేవాలయం’లో అడుగు పెడితే కాళ్లు, చేతులు వణకడం మొదలు పెడుతాయి. గుడి గంట మెగిన గుండె దడ బాగా పెరుగుతుంది. ఆ ఆలయంలో ఒకటేమి ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి. భారత్ లోని మారె ఆలయంలో కనిపించని భయానక వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. అలాగని భక్తులు లేకుండా ఈ ఆలయం ఖాళీగా ఉండదు. ఎప్పుడు ఫుల్ భక్తులతో నిండి పోయి ఉంటుంది. ఈ దేవాలయంలో ఉన్న బాలాజీ దెయ్యాలను వదిలించే శక్తి అని నమ్ముతారు. ఆలా అని బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి అని అనుకునేరు. బాలాజీ అంటే హనుమంతుడు. ఆయన అన్ని చోట్ల ఉన్నట్టు అక్కడ ఉండడు.

సాధారణ ఆలయాల్లో ఉండే హనుమంతుడి రూపంలో ఇక్కడి విగ్రహం ఉండదు. పెద్ద పెద్ద కళ్లతో కోపంగా చూస్తున్నట్టు ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూడగానే దెయ్యాలు పారిపోతాయని భక్తులు నమ్ముతారు. అలానే వారి నమ్మకం ఎప్పుడు వమ్ము కాలేదు. ఆలయం దగ్గరకు వచ్చారు అంటే చాలు దెయ్యాలు యిట్టె పారిపోతాయి. దీని గురించి తెలిసి దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. సాధారణ భక్తులు ఈ ఆలయంలో అడుగుపెడితే చాలా వింతైన అనుభూతి కలుగుతుంది. దుష్ట శక్తులు వారిలోని దెయ్యం వదిలించుకోడానికి ఆలయానికి తరలి వస్తారు. దేశ, విదేశాలకు చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు ఈ ఆలయంపై ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ, ఎవరికీ ఈ ఆలయం వెనుక రహస్యం అంతు చిక్కలేదు. దెయ్యం పట్టినట్టు.. వింత వింతగా ప్రవర్తించే వ్యక్తులు ఆలయానికి రాగానే సాధారణ స్థితికి చేరుకుంటారు. దీంతో కులమతాలకు అతీతంగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.

దెయ్యం పట్టిన బంధువులను ఆలయానికి తీసుకువచ్చి దెయ్యాన్ని వదిలిస్తారు. దెయ్యం పట్టిన వారి అరుపులు విన్న సమయంలో భయమేస్తుంది. దెయ్యం వదిలించుకున్న భక్తులు హనుమంతుడికి ఆరోజీ, స్వామణి, ధరకష్ట్, బుంది అనే కానుకలు ఇస్తారు. ఆ ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదు. తీసుకెళ్తే వారికీ కీడు జరుగుతుంది అని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడకి వచ్చే భక్తులు మాంసం, మద్యం సేవించకూడదు, అయితే శనివారం, మంగళవారం మాత్రమే దెయ్యాలను వదిలించే పూజలు చేస్తారు. ఏది ఏమైనా.. నమ్మకమే అయినా.. మరేమైనా కూడా అక్కడికి మనోవ్యాధితో వెళ్ళినవారు ఆరోగ్యవంతులుగా తిరిగి వస్తారు. ఈ ఒక్క విషయంతో మనం అక్కడ దేవుడు కొలువై ఉన్నాడని నమ్మకతప్పదు.

Related posts