మేయర్, డిప్యూటీ మేయర్ గా అవకాశం ఇవ్వడం తమ అదృష్టం మేయర్ గద్వాల విజయ లక్ష్మి పేర్కొన్నారు. ఇద్దరు మహిళలకు ఇవ్వడం గర్వకారణమని.. తనకు పేద ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉందని తెలిపారు. ప్రజల కోసం బస్తీల్లో తిరుగుతాం, అవగాహన పెంచుకుంటామని స్పష్టం చేశారు. తమ మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని మేయర్ గద్వాల విజయ లక్ష్మి తెలిపారు. అనంతరం డిప్యూటీ మేయర్ శ్రీలత మాట్లాడుతూ.. తనకు డిప్యూటీ మేయర్ ఇవ్వడం సంతోషకరమన్నారు. తన భర్త ఉద్యమకారుడని..తనకు డిప్యూటీ మేయర్ ఇవ్వడం ఉద్యమకారులకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. కాగా.. టీఆర్ ఎస్ నుండి హైదరాబాద్ మేయర్ అభ్యర్థిగా హైదరాబాద్ టీఆర్‌ఎస్ మేయర్ అభ్యర్థిగా ఖరారైన గద్వాల విజయలక్ష్మి సీనియర్ ఎంపీ కేకే కూతురు. బంజారాహిల్స్ కార్పొరేటర్ గా రెండోసారి ఆమె విజయం సాధించారు. జర్నలిజం బీఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో పరిశోధన సహాయకురాలు పనిచేశారు. 2007లోస్వదేశం తిరిగొచ్చారు. రాజకీయాల్లో చేరేందుకు నిర్ణయించుకున్న ఆమె అమెరికా పౌరసత్వం వదులుకున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మి బాబీరెడ్డిని పెళ్లి చేసుకున్నారు.
previous post