telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

జీహెచ్ఎంసీ సిబ్బంది లేకుండా.. మ్యాన్ హోల్ ఓపెన్ చేయద్దు!

heavy rains in telangana for 2days

హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. దీంతో రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు.
సహాయక చర్యలు చేపట్టిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో 04021111111, డయల్ 100, మై జీహెచ్‌ఎంసీ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

చెట్లకు, విద్యుత్ స్థంబాలకు, ట్రాన్స్‌ఫార్మర్‌లకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ లోకేష్‌కుమార్‌లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. విడతల వారీగా ఉద్యోగులు ఇండ్లకు వెళ్లాలని మేయర్ కోరారు. జీహెచ్ఎంసీ సిబ్బంది లేకుండా మ్యాన్ హోల్ ఓపెన్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

Related posts