telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మలుపులు తిరుగుతున్న బీఫార్మసీ విద్యార్థిని కేసు..

బీఫార్మసీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు. పోలీసు సైరన్‌ వినిపించడంతో ఆమెను వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. అయితే ఆమెను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇక క్యూర్ హాస్పిటల్ డాక్టర్ సౌజనయ మాట్లాడుతూ… ఫార్మసీ విద్యార్థిని 8.20 నిముషాలు మా హాస్పిటల్ కు వచ్చింది.. ఆ సమయంలో అపస్మారక స్థితిలో ఉంది.. మైనర్ ఇంజూరీస్ ఉన్నాయి. ఒంటిపై కొన్ని చోట్ల గాయాలు అయ్యాయి.. రాడ్డు తో విద్యార్థిని పై దాడి చేయడం వలన కాలుకు గాయం అయ్యింది. ఆ యువతి భయపడుతోంది.. అందుకే ఆసమయంలో పెద్దగా మాట్లాడలేదు.. కానీ ఆ తరువాత పోలీసుల విచారణలో జరిగిన సంఘటనను చెప్పింది.. అయితే విద్యార్థిని పై లైంగిక దాడి జరిగిందా లేదా అనేది చెప్పలేము అని అన్నారు. ఇంటర్నల్ గా ఆమెకు గాయాలున్నాయి… ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి బాగానే ఉంది.. మెడికల్ ఎక్జమినేషన్ కోసం ప్రభుత్వ హాస్పిటల్ కు పోలీసులు తారలించారు అని తెలిపారు. అయితే రాంపల్లిలోని ఆర్‌ఎల్‌ నగర్‌ బస్టాప్‌ వెళ్లేందుకు సెవన్‌ సీటర్‌ ఆటో ఎక్కింది. బాధితురాలు మాత్రమే ఆటోలో ఉండటంతో ఇదే అదనుగా భావించిన డ్రైవర్‌.. ఆమె దిగాల్సిన చోట ఆపకుండా వేగంగా డ్రైవర్‌ ముందుకు తీసుకెళ్లాడు. బాధితురాలు తన తల్లికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు డయల్‌ 100కు కాల్‌చేసి ఫిర్యాదు చేశారు. కీసర, ఘట్‌కేసర్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. సైరన్‌ విన్పించడంతో పోలీసులు తమను వెంటాడుతున్నారని భావించిన నిందితులు.. ఘట్‌కేసర్‌ రైల్వే ట్రాక్‌ దగ్గర ఆమెను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు.

Related posts