telugu navyamedia
telugu cinema news trending

రష్మీ, సుధీర్ అఫైర్… గుట్టు విప్పిన గెటప్ శ్రీను

Getup-Srinu

బుల్లితెరపై ప్రసారమవుతున్న “జబర్దస్త్” కామెడీ షోతో గెటప్ శ్రీను క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఇక అదే షో ద్వారా యాంకర్ గా పరిచయమైన రష్మీ, సుధీర్ ల మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై రష్మీ, సుధీర్ తమమధ్య ఎలాంటి ఎఫైర్ లేదంటూ ఎన్నోసార్లు స్పష్టతనిచ్చినప్పటికీ ఆ వార్తలు మాత్రం ఆగలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై గెటప్ శ్రీను స్పందించాడు.

”రష్మి ఆమె పనులతో చాలా బిజీగా ఉంటారని, సుధీర్, రష్మీ ఇద్దరూ మంచి స్నేహితులు మాత్రమే… రష్మి మంచి అమ్మాయి… ఆమెను మా కుటుంబంలో అమ్మాయిగానే చూస్తాం మేమందరం. సుధీర్, రష్మి ల మధ్య చిన్న ట్రాక్ పెట్టి కామెడీ చేద్దామని పెట్టాము… కానీ అదికాస్తా వారి వ్యక్తిగత జీవితాలపై ఎఫెక్ట్ చూపించింది. సుధీర్ ఫ్యామిలీ అయితే ఈ విషయంపై చాలా బాధ పడుతుంటారు. సుధీర్ కి పెళ్లి సంబంధాలు చూస్తుంటే… రష్మి టాపిక్ తీసుకొస్తున్నారు. అలా అడిగితే ఎవరికైనా బాధగానే ఉంటుంది. సుధీర్, రష్మి కనీసం నెలకి ఒకసారి కూడా ఫోన్ చేసుకోరు. ఎవరి పనుల్లో వారు చాలా బిజీగా ఉంటారు. ఇలాంటి రూమర్లు రావడంతో రష్మి కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నారు. దయచేసి వారిద్దరి మధ్య ఏదో ఉందని ఊహించుకోకండి… వారిద్దరి మధ్య ఏం లేదు” అంటూ రష్మీ, సుధీర్ ల ఎఫైర్ పై వస్తున్న వార్తలపై స్పష్టతనిచ్చాడు గెటప్ శ్రీను.

Related posts

బంగారం ధరలు…

vimala p

సీటు ఇస్తానంటే.. బెంబేలెత్తుతున్న టీడీపీ నేతలు…! ఇదేమి విడ్డురం.. !!

vimala p

మారథాన్ లో అమలాపాల్.. కిలోమీటర్ల మేర పరిగెత్తిన చిన్నది..

ashok