telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

“జార్జిరెడ్డి” ప్రోమో పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

rajasing mla bjp

“జార్జిరెడ్డి” చిత్రం ప్రోమో పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం ప్రోమోలో ‘వన్ సైడ్’గా చూపించారని విమర్శించారు. విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రంలో వాస్తవం ఏంటో చూపిస్తేనేగా ప్రజల నుంచి స్పందన వచ్చేదని అన్నారు.

సినిమా ముసుగులో ఏబీవీపీని కించపరిస్తే సహించమని, అలా చేస్తే కనుక అడ్డుకుంటామని హెచ్చరించారు. జార్జిరెడ్డి హత్య సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుందని, ఏబీవీపీకి చెందిన వ్యక్తులు ఈ హత్య చేశారన్నట్టుగా ఈ మూవీలో చూపిస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలు చూపించండి, అబద్ధాలు కనుక చూపిస్తే తమ నుంచి రియాక్షన్ వుంటుందని హెచ్చరించారు.

ఈ సినిమాలో కొన్ని షాట్లను కట్ చేయాలని డిమాండ్ చేశారు. అసలు, ఇలాంటి చిత్రాలకు సెన్సార్ బోర్డు ఎలా పర్మిషన్ ఇస్తోందో తనకు అర్థం కాలేదని అన్నారు. ఏదో ఒక పాత కథను తీసుకుని, మసాలా జోడించి ఒక వర్గాన్ని తక్కువగా మరో వర్గాన్ని ఎక్కువగా చూపించేలా చిత్రాలు తీయడం ఈరోజు ఓ బిజినెస్ అయిపోయిందని విమర్శించారు.

Related posts