telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టిఎస్ఆర్టీసీ బాదుడు.. బస్‌పాస్‌ ఛార్జీల పెంపు!

passengers fire on tsrtc buses shortage

సమ్మె అనంతరం తెలంగాణ ఆర్టీసీ చార్జీల మోత మోగించింది. ఇప్పటికే కిలోమీటర్ కు 20 పైసలు పెంచుతునట్టు ప్రకటించిన యాజమాన్యం తాజాగా జనరల్‌, స్టూడెంట్‌ బస్‌పాస్‌ ఛార్జీలను కూడా పెంచారు. సిటీ ఆర్డినరీ పాస్‌ ఛార్జీ రూ. 770 నుంచి రూ. 950కి పెంపు, మెట్రో పాస్‌ ఛార్జీ రూ. 880 నుంచి రూ. 1070కి పెంపు, మెట్రో డీలక్స్‌ పాస్‌ ఛార్జీ రూ. 990 నుంచి రూ. 1180కి పెంచారు. ఎన్జీవోలకు సంబంధించి సిటీ ఆర్డినరీ పాస్‌ ఛార్జీ రూ. 260 నుంచి రూ. 320కి పెంపు, మెట్రో పాస్‌ ఛార్జీ రూ. 370 నుంచి రూ. 450కి పెంపు, మెట్రో డీలక్స్‌ పాస్‌ ఛార్జీ రూ. 480 నుంచి రూ. 575కి పెంచారు. ఎంఎంటీఎస్‌ – ఆర్టీసీ కాంబో టికెట్‌ ధరలను రూ. 880 నుంచి రూ.1090కి పెంచారు.

స్టూడెంట్‌ రూట్‌ పాస్‌(క్వార్టర్లీ) ఛార్జీ రూ. 130 నుంచి రూ. 165కి పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైస్కూల్‌, కాలేజీ విద్యార్థులు తీసుకునే మఫిసిల్‌(క్వార్టర్లీ) పాస్‌ ఛార్జీని రూ. 235 నుంచి రూ. 310కి పెంచారు. హైస్కూల్‌, కాలేజీ విద్యార్థులు తీసుకునే మఫిసిల్‌(మంత్లీ) పాస్‌ ఛార్జీని రూ. 85 నుంచి రూ. 115కి పెంచుతున్నట్టు వెల్లడించారు.

Related posts