telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జెనీలియా రీఎంట్రీ… హాట్ ఫోటోలకు ఫోజు

Genelia

తెలుగు ప్రేక్షకులకు “బొమ్మరిల్లు”తో బాగా దగ్గరైన బ్యూటీ జెనీలియా 2012 ఫిబ్రవరి 3న‌ రితీష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత ఈ జంటకు 2014 లో రియాన్ అనే మగ బిడ్డ జన్మించారు. ఈ మాజీ హీరోయిన్ జెనీలియా కూడా సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉందట. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌కు భార్యగా మారిన తర్వాత జెనీలియా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన జెనీలియా మళ్లీ సినిమాల్లో నటించాలని ఇప్పుడు భావిస్తోందట. అందుకే హాట్ ఫొటోషూట్లలో పాల్గొని వాటిని తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తోందట. బాలీవుడ్ లేదా దక్షిణాది సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోందట. మంచి పాత్ర దొరికితే చేయాలని ఉత్సాహంగా ఉందట. ఇక దీపికా పదుకొనే, అనుష్కా శర్మ, ప్రియాంకా చోప్రా వంటి హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. కరీనా కపూర్, ఐశ్వర్యా రాయ్ వంటి వారు తల్లులుగా మారిన తర్వాత కూడా హీరోయిన్ అవకాశాలు అందుకుంటున్నారు.

 

View this post on Instagram

 

No one reaches the finish line by looking back

A post shared by Genelia Deshmukh (@geneliad) on

 

View this post on Instagram

 

The silhouette says a lot with very little information

A post shared by Genelia Deshmukh (@geneliad) on

Related posts