telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ సినిమా వార్తలు

“వి” సినిమా టెలికాస్ట్… భారీ షాక్ ఇచ్చిన ప్రముఖ ఛానెల్

V

ఇటీవల నాని, సుధీర్‌బాబు నటించిన ‘వి’ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జెమిని టీవీ భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ లోకల్ ఛానల్‌ ‘వి’ సినిమాను టెలికాస్ట్ చేసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జెమిని టీవీ ఆ లోకల్ ఛానల్‌కు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా సినిమా టెలికాస్ట్ చేసినందుకు ఏకంగా రూ.2 కోట్ల జరిమానా చెల్లించాలని కోరిందట. జెమిని టీవీ తీసుకున్న ఈ నిర్ణయంపై మిగతా ఛానల్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కాగా కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఇటీవల చాలా సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లి సినిమా చూసే పరిస్థితి లేకపోవడంతో నిర్మాతలు ఓటీటీ, శాటిలైట్ రైట్స్‌నే నమ్ముకుని గట్టెక్కుతున్నారు. మరోపక్క ఆ సినిమాను టెలీకాస్ట్‌ చేసేందుకు ఛానల్స్‌ సిద్ధమవుతున్న సమయంలో కొన్ని లోకల్ ఛానళ్లు అక్రమంగా వాటిని టెలీకాస్ట్‌ చేస్తున్నాయి. దీంతో ఈ విషయంపై సినెమా పెద్దలు సీరియస్ అవుతున్నారు.

Related posts