telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ప్రజల నడ్డివిరిచిన మోడీ.. మరోసారి పెరిగిన వంట గ్యాస్‌ ధరలు

Gas

మరోసారి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరిచింది. ఇప్పటికే రెండు నెలల వ్యవధిలో నాలుగు సార్లు వంట గ్యాస్‌ ధరలు పెంచిన కేంద్రం.. తాజాగా మరోసారి సామాన్యుడి నడ్డివిరిచింది. వంటగ్యాస్‌తో పాటు వాణిజ్య సిలిండర్‌పై ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వంటగ్యాస్‌పై రూ. 25, వాణిజ్య సిలిండర్‌పై రూ. 95 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి చమురు సంస్థలు. వంటగ్యాస్‌పై డిసెంబర్‌ 1 నుంచి ఇప్పటి వరకు రూ. 225 పెంచారు. డిసెండర్‌ 1న సిలిండర్‌ ధర రూ. 594 నుంచి రూ. 644కి పెంచారు. ఆ తర్వాత జనవరి 1న రూ. 644 నుంచి రూ. 694కు పెంచగా.. ఫిబ్రవరి 4న మరోసారి రూ. 644 నుంచి రూ. 719 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 15న రూ. 50 పెంచడంతో 769కి పెరిగింది. ఇక ఇటీవల ఐదు రోజుల వ్యవధిలో తాజా పెంపుతో కలిపి రెండు సార్లు వంటగ్యాస్‌పై రూ. 25 వడ్డించారు. దీంతో ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్‌ ధర రూ. 819కి చేరింది. వాణిజ్య సిలిండర్‌పైనా రూ. 95 పెరగడంతో.. ఒక సిలిండర్‌ ధర రూ. 1614 కు చేరింది.

Related posts