• Home
  • వార్తలు
  • బహ్రెయిన్‌లో సిలిండర్‌ పేలి నలుగురి మృతి.. ప్రమాదంపై చంద్రబాబు ఆరా
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

బహ్రెయిన్‌లో సిలిండర్‌ పేలి నలుగురి మృతి.. ప్రమాదంపై చంద్రబాబు ఆరా

Gas cylinder blast, 4 members death

మధ్య ఆసియా దేశమైన బహ్రెయిన్‌లో ఓ భవనంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురు మృతి చెందగా, 20 మందికి గాయాలయ్యాయి. భవనం రెండో అంతస్తులో ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి భవనం నేలమట్టమైంది. సమాచారం అందుకున్న సహాయ బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించాయి. గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు దాటికి భవనం కుప్ప కూలింది. ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవన శిథిలాల కింద ఎవరైనా ఉన్నారేమోనని బృందాలు గాలిస్తున్నాయి.

బహ్రెయిన్‌ గ్యాస్‌ సిలిండర్‌ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మృతుల్లో తెలుగువారు ఉన్నారన్న కథనాలపై సీఎం స్పందించారు. ఏపీ భవన్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు. భారత రాయబార కార్యాయలంతో సంప్రదించినట్టు రెసిడెంట్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ తెలిపారు. మృతులంతా బంగ్లాదేశీయులే అని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

Related posts

దసరా పండక్కి ఇంటికి తాళం వేసి వెళుతున్నారా..? అయితే ఒక్కసారి ఇది చూడండి

nagaraj chanti

చంద్రబాబు తో కేజీవ్రాల్ భేటీ…

admin

తెరాసలో 'ముసలం'?

admin

Leave a Comment