telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తిరుమల : … గరుడ వాహనంపై .. శ్రీ మలయప్పస్వామి .. భక్తకోటికి దర్శనం..

garudavahanam today in brahmostav

శ్రీ మలయప్పస్వామివారు సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు రాత్రి గరుడ వాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చాడు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు వెళుతుండగా భక్తుల కోలాటాలు, డ్రమ్స్‌ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ కోలాహలంగా సాగింది. అన్ని గ్యాలరీల వద్ద స్వామివారిని అటు ఇటు తిప్పుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.వాహనసేవ ప్రారంభమైన కోద్దిసేపటికే భారీగా వర్షం పడినప్పటికి గ్యాలరీల్లోని భక్తుల గోవిందనామలతో వెంకన్నను స్మరించుకుంటు స్వామి వారిని దర్శించుకున్నారు. గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో పి.బసంత్‌కుమార్‌, సివిఎస్వో గోపినాథ్‌జెట్టి, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్విరాజ్, ధర్మకర్తల మండలి సభ్యులు తెలంగాణ పబ్లికేషన్స్ సీఎండీ దామోదర రావు, మేడా మల్లికార్జునరెడ్డి, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, కృష్ణమూర్తి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts